యువ దర్శకుడికి తెలుగువన్ నివాళి
on Dec 13, 2016

సినిమా అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఓ వర్థమాన దర్శకుడిని మృత్యువు కబళించింది. ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతిభతో ఓ వెలుగు వెలగాలనుకున్న నక్షత్రం ఆదిలోనే రాలిపోయింది. UNKNOWN అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సదాశివ కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో తెలుగువన్ సంస్థ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ద్వారా వెలుగులోకి వచ్చారు సదాశివ. దీనిలో భాగంగా 2014 మే 16 నుంచి 15 జూన్ మధ్యలో తెరకెక్కిన షార్ట్‌ఫిల్మ్స్‌లో సదాశివ రూపొందించిన "UNKNOWN" షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఇందుకు గానూ తెలుగువన్ సంస్థ సదాశివను నగదు పురస్కారంతో సత్కరించింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన లక్ష్యమైన సినిమా కలను నెరవేర్చుకుంటుండగా విధి మృత్యువు రూపంలో కబళించింది. ఆయన ఆకస్మిక మరణానికి చింతింస్తూ..సదాశివ ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తోంది తెలుగువన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



