మణిరత్నం సినిమాలో మెరవనున్న కన్నడ భామ!
on Jul 11, 2016
మల్టీప్లెక్స్ ఆడియన్స్ విశేషంగా ఆదరించిన కన్నడ సూపర్ హిట్ సినిమా "యు టర్న్" కమర్షియల్ గా సూపర్ హిట్ సాధించింది. హైద్రాబాద్ లోనూ ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడిందంటే.. సినిమా స్టామినాను అర్ధం చేసుకోవచ్చు. అలాంటి సినిమా ద్వారా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితురాలైన కథానాయకి శ్రద్ధా శ్రీనాధ్. అభినయ సామర్ధ్యంతోపాటు ఆకట్టుకొనే అందం కూడా పుష్కలంగా ఉన్న ఈ అమ్మడు త్వరలోనే తమిళనాట కథానాయికగా పరిచయంకానుంది.
అయితే.. ఈలోపే శ్రద్ధాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించే అవకాశాన్ని సొంతం చేసుకొంది. కార్తీ-అదితిరావు జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా క్యారెక్టర్ ఎంటనేది తెలియదు కానీ.. కథలో కీలకమలుపు ఈమె ద్వారానే జరుగుతుందని తెలుస్తోంది!