త్రిష వరుణ్‌కి టాటా చెప్పేసిందా??
on Mar 28, 2015
సినిమావాళ్ల జీవితాలే కాదు, వాళ్ల బంధాలూ గాలి బుడగలే. ఎప్పుడు ఏ బంధం పుటుక్కుమంటుందో ఎవ్వరం చెప్పలేం. ఇప్పుడు త్రిష పరిస్థితీ అదేనని తమిళనాట చెవులు కొరుక్కొంటున్నారు. వరుణ్ అనే వ్యాపార వేత్తతో త్రిష ప్రేమలో పడడం, వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం, ఆ తరవాత నిశ్చితార్థం చేసుకోవడం.. ఇవన్నీ మన కళ్ల ముందు జరిగిన విషయాలు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య గాప్ వచ్చేసిందట. త్రిష వరుణ్‌కి దూరంగా ఉంటుందని, వీళ్లిద్దరి మధ్య.. ఏదో తిరకాసు జరుగుతోందని చెన్నై వాసులు చెప్పుకొంటున్నారు. ఈమధ్య వరుణ్ త్రిష దగ్గరకు ఓ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడట. ఈ సినిమాపై సంతకం చేయ్... అని అడిగాడట. దానికి త్రిష నో చెప్పిందని తెలుస్తోంది. ''డేట్లు ఖాళీ లేవు '' అని చెప్పి తప్పించుకొన్న త్రిష.. వెంటనే తన మేనేజర్ గిరిధర్ సినిమాకి సైన్ చేసేసిందట. ''నాకు డేట్లు లేవని చెప్పి.. గిరిధర్ కి ఎలా ఒప్పుకొన్నావ్'' అంటూ వరుణ్ నిలదీసినట్టు.. దాంతో వీళ్లిద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగినట్టు చెప్పుకొంటున్నారు. మరో విషయం ఏంటంటే.. నిశ్చితార్థమై ఇన్ని రోజులు గడిచినా.. పెళ్లికి డేట్ మాత్రం ఫిక్స్ చేసుకోలేదు. త్రిష కూడా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇవన్నీ చూస్తుంటే తేడా కొట్టడం లేదూ..?!