సోనీ లివ్‌లో త్రిష వెబ్ - సిరీస్!
on Dec 17, 2021

ఈ ఏడాది ప్రథమార్ధంలో కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత వంటి దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర కథానాయికలు వెబ్ - సిరీస్ లతో సందడి చేశారు. ఫలితాల మాటెలా ఉన్నా.. తమ అభినయంతో మెప్పించారీ స్టార్ బ్యూటీస్.
కట్ చేస్తే.. త్వరలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన మరో స్టార్ బ్యూటీ వెబ్ - సిరీస్ తో పలకరించనుంది. ఆమె మరెవరో కాదు.. చెన్నై పొన్ను త్రిష. ఇటీవలే నటిగా 19 ఏళ్ళ కెరీర్ ని పూర్తిచేసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఈ ఏడాది ప్రథమార్ధంలో తన 60వ చిత్రం `పరమపదం విళైయాట్టు`తో ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం త్రిష చేతిలో ప్రతిష్ఠాత్మక చిత్రం `పొన్నియన్ సెల్వన్`తో పాటు మరో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్స్ తో పాటు `బృంద` అనే ఓ తెలుగు వెబ్ - సిరీస్ లో నటిస్తోంది త్రిష. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమ్ కాబోతోందని సమాచారం. కాగా, 2022 ఆరంభంలో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో త్రిష డెబ్యూ వెబ్ - సిరీస్ `బృంద` స్ట్రీమ్ కాబోతోందని బజ్. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ కి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. తొలి వెబ్ సిరీస్ తో త్రిష ఎలాంటి ఫలితాన్ని, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



