అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్!
on Mar 30, 2025
పుష్ప-2 తో సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. నేషనల్ వైడ్ గా తిరుగులేని ఫాలోయింగ్ అల్లు అర్జున్ సొంతం. ఆయనకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు బన్నీ తన ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. (Allu Arjun)
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ముందుగా ఏప్రిల్ 5న ఆర్య-2 రీరిలీజ్ అవుతోంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ తన పర్ఫామెన్స్, డ్యాన్స్ లతో ఆర్య-2 ని తన కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ గా మలిచాడు. ఈ మూవీని మళ్ళీ థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
బన్నీ బర్త్ డేకి రెండు కొత్త సినిమా అప్డేట్స్ కూడా వచ్చే అవకాశముంది. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను డైరెక్టర్స్ త్రివిక్రమ్, అట్లీలతో చేయనున్నాడు. త్రివిక్రమ్ మూవీని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అట్లీ ప్రాజెక్ట్ ని బన్నీ పుట్టినరోజుకి అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే, త్రివిక్రమ్ ఫిల్మ్ కి సంబంధించిన కొత్త అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
ఆర్య-2 రీరిలీజ్, అట్లీ మూవీ అనౌన్స్ మెంట్, త్రివిక్రమ్ ఫిల్మ్ అప్డేట్ తో తన బర్త్ డేకి అల్లు అర్జున్ ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
