ENGLISH | TELUGU  

2021 ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం.. `కెప్టెన్ ఆఫ్ ది ఇయ‌ర్`గా బోయ‌పాటి!

on Dec 31, 2021

2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ ప‌లువురు ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుల‌కు గుర్తుండిపోయే విజ‌యాల‌ను అందించింది. ఎంతో కొంత అనుభ‌వం గ‌డించిన నిర్దేశ‌కులూ ఈ ఏడాది హిట్స్ చూశారు. 2021లో ఎవ‌రెవ‌రు ఏయే చిత్రాల‌తో ప‌ల‌క‌రించారంటే..

బోయ‌పాటి శ్రీ‌నుః- మాస్  సినిమాల స్పెష‌లిస్ట్ గా పేరు తెచ్చుకున్న బోయ‌పాటి శ్రీ‌ను ఈ ఏడాది `అఖండ‌`తో ప‌ల‌క‌రించారు. డిసెంబ‌ర్ తొలి వారంలో విడుద‌లైన ఈ డివోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్.. క‌రోనా సెకండ్ వేవ్ త‌రువాత పెద్ద సినిమాల‌కు ఊపిరి పోసింది. బాల‌య్య కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచిన ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి మ‌రో స్థాయికి వెళ్ళారు. మ‌హిళా ప్రేక్ష‌కుల‌ను సైతం థియేట‌ర్స్ కి ర‌ప్పించిన మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా మ‌న్న‌న‌లు పొందింది `అఖండ‌`. థియేట‌ర్స్ లో మాస్ జాత‌ర చేయించి మ‌రీ `కెప్టెన్ ఆఫ్ ది ఇయ‌ర్`గా నిలిచారు బోయ‌పాటి.

సుకుమార్ః- బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ ఏడాది పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్`తో ప‌ల‌క‌రించారు. వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తూ.. ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమాతో సుక్కు మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నారు.  

శేఖ‌ర్ క‌మ్ములః- సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ ఏడాది `ల‌వ్ స్టోరి`తో ఇంప్రెస్ చేశారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా యువత‌రాన్ని, కుటుంబ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంది.

గోపీచంద్ మ‌లినేనిః- టాలెంటెడ్ కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని ఈ సంవ‌త్సరం `క్రాక్`తో ప‌ల‌క‌రించారు. 2021 ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు గోపీచంద్.

అనుదీప్ః- బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `జాతిర‌త్నాలు`తో టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అయ్యాడు అనుదీప్. అంత‌కుముందు `పిట్ట‌గోడ‌` అనే సినిమా తీసినా.. త‌న‌కిదే ఫ‌స్ట్ స‌క్సెస్.

భాస్క‌ర్ః- చాలా కాలంగా స‌రైన విజ‌యం లేని `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్.. ఈ ఏడాది `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తో హిట్ కొట్టాడు.

శ్రీ‌కాంత్ అడ్డాలః- గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పిన శ్రీ‌కాంత్ అడ్డాల‌కి `నార‌ప్ప‌` ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. థియేట‌ర్స్ లో కాకుండా ఓటీటీలో రిలీజైన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. వీక్ష‌కాద‌ర‌ణ పొందింది.

రాహుల్ సాంకృత్య‌న్ః- `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్.. ఈ ఏడాది చివ‌ర‌లో `శ్యామ్ సింగ రాయ్`తో ఎంట‌ర్టైన్ చేశాడు. త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు.

సంప‌త్ నందిః- స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్`తో ఎంట‌ర్టైన్ చేసిన సంప‌త్ నంది.. ఈ సంవ‌త్స‌రం త‌న ఖాతాలో ఓ డీసెంట్ హిట్ ని క్రెడిట్ చేసుకున్నాడు.

వేణు శ్రీ‌రామ్ః- `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ఈ ఏడాది `వ‌కీల్ సాబ్`తో ప‌ల‌క‌రించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రి-ఎంట్రీ మూవీగా రూపొందిన ఈ సినిమా తెలుగునాట స‌క్సెస్ ఫుల్ వెంచ‌ర్ గా నిలిచింది.

జీతూ జోసెఫ్ః- ప్ర‌ముఖ మాలీవుడ్ డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్.. ఈ ఏడాది `దృశ్యం 2`తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను నేరుగా ప‌ల‌క‌రించాడు. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా వీక్ష‌కాద‌ర‌ణ పొందింది.

కిశోర్ తిరుమ‌లః- ఫీల్ గుడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన కిశోర్ తిరుమ‌ల ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో మాస్ థ్రిల్ల‌ర్ `రెడ్`తో ఎంట‌ర్టైన్ చేసి చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ చూశాడు.

వీరితో పాటు బి. గోపాల్ (ఆర‌డుగుల బుల్లెట్),  ఆర్జీవీ (దెయ్యం), క్రిష్ (కొండ పొలం), మారుతి (మంచి రోజులు వ‌చ్చాయి), దేవ క‌ట్టా (రిప‌బ్లిక్), శివ నిర్వాణ (ట‌క్ జ‌గ‌దీశ్ - అమెజాన్ ప్రైమ్), మేర్ల‌పాక గాంధీ (మేస్ట్రో - డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్), వెంకీ అట్లూరి (రంగ్ దే), చంద్ర‌శేఖ‌ర్ యేలేటి (చెక్), సంతోష్ శ్రీ‌నివాస్ (అల్లుడు అదుర్స్), ప్ర‌శాంత్ వ‌ర్మ (జాంబీ రెడ్డి), క‌రుణ కుమార్ (శ్రీ‌దేవి సోడా సెంట‌ర్), అజ‌య్ భూప‌తి (మ‌హా స‌ముద్రం), శ‌ర‌ణ్ కొప్పిశెట్టి (తిమ్మ‌రుసు), జి. నాగేశ్వ‌ర రెడ్డి (గ‌ల్లీ రౌడీ) వంటి ద‌ర్శ‌కులు కూడా ఈ ఏడాది త‌మ కొత్త చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు. అలాగే ఆంథాలజీ ఫిల్మ్ `పిట్ట‌క‌థ‌లు`తో నాగ్ అశ్విన్, నందినీ రెడ్డి, సంక‌ల్ప్ రెడ్డి, త‌రుణ్ భాస్క‌ర్ ఓకే అనిపించుకున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.