నేపాల్ భూకంపం..టాలీవుడ్ కొరియోగ్రాఫర్ మృతి
on Apr 27, 2015
చిత్రసీమకు ఇది మరో షాకింగ్ న్యూస్. వరుస మరణాలతో భీతిల్లుతున్న టాలీవుడ్‌కి మరో చేదు వార్త. నేపాల్‌లో సంభవించిన భూకంపంలో యువ కొరియోగ్రాఫర్, నటుడు విజయ్ మృతి చెందారు. నేపాల్‌లో వచ్చిన భూకంపంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ చిత్రీకరణ జరుపుకొంటున్న ఎటకారం టీమ్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకొంది. భూకంపం సంభవించిన మరుసటి రోజు చిత్రబృందమంతా తిరుగు ప్రయాణమైంది. 27వ తేదీన నేపాల్ లో భూమి మళ్లీ కంపించింది. ఆ ప్రకంపనలకు ఎటకారం టీమ్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడిందని సమాచారం. ఈ ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని, మిగిలినవాళ్లంతా క్షేమంగా బయటపడ్డారని చిత్రబృందం తెలిపింది. గుంటూరుజిల్లా బాపట్లకు చెందిన విజయ్ వయసు 25 యేళ్లు మాత్రమే. విజయ్ హఠాన్మరణం చిత్రబృందాన్ని విపరీతంగా కలచివేస్తోందిప్పుడు. అతని ఆత్మకు శాంతి కలగాలని తెలుగువన్ కోరుకొంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
