అతన్ని కాపాడుతుందా మరి!.. రష్మిక పై మీ అభిప్రాయం ఏంటి
on Oct 25, 2025

ఎనీ లాంగ్వేజ్ ని తీసుకున్నా సదరు లాంగ్వేజ్ లో మూవీ ఘన విజయం సాధించడానికి హీరో నే ముఖ్యం. సినిమా ఫలితంలో తేడా వచ్చినా ఓపెనింగ్ కలెక్షన్స్ ని అయినా రాబట్టాలన్నా హీరో కట్ అవుట్ నే దిక్కు. హీరోయిన్ ని మెయిన్ కట్ అవుట్ గా చేసుకొని సినిమాలు నిర్మించడం అనేది చాలా తక్కువ. 90 వ దశకంలో విజయశాంతి కొన్ని చిత్రాల ద్వారా సక్సెస్ అయ్యింది కానీ ఎక్కువగా కంటిన్యూ చేయలేకపోయింది.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rakshmika Mandanna)వచ్చే నెల నవంబర్ 7 న తన కొత్త చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl friend)తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా చిత్ర బృందం ట్రైలర్ ని రిలీజ్ చేయగా సిల్వర్ స్క్రీన్ పై రష్మిక నే పూర్తిగా కనపడనుందనే విషయం అర్ధమవుతుంది. ఈ విషయాన్నీ మేకర్స్ ఈ చిత్ర ప్రకటన రోజే చెప్పినా, ట్రైలర్ రిలీజ్ తో మరోసారి రష్మిక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
మేకర్స్ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి ముఖ్యకారణం రష్మిక నే. ఆమె ప్రస్తుతం థియేటర్స్ లో 'థామ'(Thamma)తో సందడి చేస్తుంది. ఈ చిత్రంలో రష్మిక నే ప్రధాన ఆకర్షణ కాగారిజల్ట్ విషయంలో మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కలెక్షన్ లు కూడా పెద్దగా లేవు. ఈ నేపధ్యంలో గర్ల్ ఫ్రెండ్ మూవీ కి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, ఒక వేళ మిక్స్డ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఈ మేర వస్తాయనే చర్చ సోషల్ మీడియాలో జరుగతుంది. మూవీ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకమైతే అభిమానుల్లో ఉంది. చిత్ర బృందం కూడా అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి,ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న గర్ల్ ఫ్రెండ్ కి రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran)దర్శకుడు. పదమూడు సంవత్సరాల నుంచి రాహుల్ రవీంద్రన్ మైండ్ లో ఈ చిత్ర కథ రన్ అవుతు ఉంది. దీక్షిత్ శెట్టి(Dheekshith shetty)హీరో కాగా రష్మిక తండ్రి క్యారక్టర్ లో రావు రమేష్ కనిపిస్తున్నాడు. హేషమ్ అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab)మ్యూజిక్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



