ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్..!
on Jan 10, 2025
గతేడాది 'కల్కి 2898 AD' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2' వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్' మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుందని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారినట్లు తెలుస్తోంది. (The Raja Saab)
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా వాయిదా పడనుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ లో తమ సినిమాని విడుదల చేయనున్నట్లు పలువురు ప్రకటిస్తూ వస్తున్నారు. రాజా సాబ్ నిర్మాతల నుంచి వచ్చిన వాయిదా సమాచారంతోనే, ఇతర చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై త్వరలోనే ప్రేక్షకులకు సైతం నిర్మాతలు క్లారిటీ ఇవ్వబోతున్నారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రాజా సాబ్ నుంచి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేయనున్నారట మేకర్స్. ఆ పోస్టర్ తోనే సినిమా వాయిదా విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.
Also Read