The Raja Saab Trailer 2.0: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!
on Dec 29, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) తన కెరీర్ లో మొదటిసారి 'ది రాజా సాబ్'(The Raja Saab) అనే హారర్ కామెడీ ఫిల్మ్ చేశాడు. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. ఆడియన్స్ లో ఈ సినిమాపై ఎక్కడో చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఆ అనుమానాలు అన్నింటినీ పటాపంచలు చేసేలా రాజా సాబ్ ట్రైలర్ 2.0 వచ్చింది.
'ది రాజా సాబ్' నుంచి తాజాగా మేకర్స్ కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మూడు నిమిషాలకు పైగా నిడివితో రూపొందిన ఈ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ లా ఉంది. గతంలో విడుదలైన టీజర్, ట్రైలర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్ ని చూపిస్తే.. ఈ ట్రైలర్ లో మాత్రం ప్రధానంగా ఎమోషన్స్ ని చూపించారు. నానమ్మ, మనవడి బాండింగ్ ని తెలిపే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. విజువల్స్ కట్టిపడేశాయి. కొన్ని కొన్ని షాట్స్ హాలీవుడ్ సినిమాలని తలపించాయి.
తమ నానమ్మ కోసం అత్యంత ప్రమాదకరమైన తాత భూతం(సంజయ్ దత్)తో ప్రభాస్ తలపడినట్లు ట్రైలర్ ను రూపొందించారు. హారర్ ఎలిమెంట్స్ ఎంతగా హైలైట్ అయ్యాయో.. ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో హైలైట్ అయ్యాయి. ఇక ప్రభాస్ ని చూపించిన తీరు మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా మొసలిని పైకి లేపి నేలకేసి కొట్టే షాట్ మెయిన్ హైలైట్ గా నిలిచింది. అలాగే ట్రైలర్ చివరిలో జోకర్ గెటప్ లో ప్రభాస్ కనిపించడం బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. విజువల్స్ తో పాటు తమన్ మ్యూజిక్ కూడా మెప్పించింది.
మొత్తానికి 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్ తో డైరెక్టర్ మారుతి సర్ ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. తాను భారీ సినిమాలు చేయగలననే విషయాన్ని ఈ ట్రైలర్ తో బలంగా చాటి చెప్పాడు.
Also Read: కళ్లుచెదిరే ధరకి AA22 ఓటీటీ డీల్.. బడ్జెట్ లో 60 శాతం వచ్చేసింది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



