ఈ నెల తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విజేత 'వుడ్స్'
on Nov 25, 2014
తెలుగువన్ గత కొంతకాలంగా అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. 16 అక్టోబర్ నుంచి 15 నవంబర్ వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'Woods' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన Ashish Yadav & Poras Beniwal ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.