రానా 'కృష్ణుడు...' హిందూ దేవుళ్లను అవమానించాడా?
on Jun 30, 2020
'బాయ్‌కాట్‌నెట్‌ఫ్లిక్స్' హ్యాష్‌ట్యాగ్ కొన్ని గంటలుగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి వచ్చిన 'కృష్ణ అండ్ హిజ్ లీల'. రీసెంట్గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిందీ సినిమా. ఇందులో హీరో పేరు కృష్ణ. ఒక హీరోయిన్ పేరు సత్య. మరో హీరోయిన్ పేరు రాధ. ఈ సినిమా హిందూ దేవుళ్లను అవమానించేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమాలో హీరో ఇద్దరు హీరోయిన్లను లవ్ చేస్తాడు. ఇద్దరితో శృంగారంలో పాల్గొంటాడు. పైగా, ఇద్దరినీ సమానంగా ప్రేమించానని చెబుతాడు. అటువంటి హీరోకి కృష్ణుడి పేరు పెట్టడం హిందూ దేవుళ్లను అవమానించడమే అనీ, అటువంటి సినిమా రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌ని బాయ్‌కాట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.
"నైతిక విలువలు, సంప్రదాయాలకు హైపర్ సెక్సువల్ కంటెంట్ తూట్లు పొడుస్తున్నాయి. ప్రేక్షకులను ఈజీగా ఆకట్టుకోవడానికి సెక్స్ ను వాడుకుంటున్నాయి. టీనేజర్ల మీద ఎఫెక్ట్ పడుతోంది. అలాగని బాయ్‌కాట్ చేయడం ఆప్షన్ కాదు. కంటెంట్ వల్ల హిందూయిజానికి అవమానం జరిగింది" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దాంతో సినిమా మేకర్ల మీదకు కొందరి దృష్టి పడింది. చాలామంది అమ్మాయిలతో కృష్ణుడికి సంబంధాలు ఉన్నాయని అన్నట్టు చూపించి మరోసారి నెట్‌ఫ్లిక్స్ హిందూ దేవుళ్లను అవమానించిందని ఓ అమ్మాయి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read