అల్లు శిరీష్ ని కుమ్మేసిన హీరోయిన్!
on Jul 26, 2016

యంగ్ మెగా హీరో అల్లు శిరీష్ ని ఒక హీరోయిన్ పిచ్చ కొట్టుడు కొట్టింది. ఆ కొట్టుడు కూడా మామూలు కొట్టుడు కాదండోయ్.. అయ్యగారికి దెబ్బకి తాతగారు అల్లు రామలింగయ్య గారు గుర్తొచ్చుంటారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు కొట్టింది? అని మీలో మీరు ఆలోచించేసుకోకుండా ఈ ఆర్టికల్ ను చదివితే మీకు సమాధానం దొరుకుతుంది.
అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం "శ్రీరస్తు శుభమస్తు". "సోలో" ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం ట్రైలర్ ను క్రిష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో అల్లు శిరీష్ అదే పనిగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఎడిపిస్తూ ఉంటాడు. ఎంత ఓపిక, ఓర్పు ఉన్నా సహనం సన్నగిల్లితే ఏం చేయగలం చెప్పండి. అందుకే ఆటపట్టిస్తున్న అల్లు శిరీష్ తో బాక్సింగ్, ఫుట్ బాల్ లాంటి ఆటలు ఆడేసింది. చూడడానికి చాలా సరదాగా ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. శిరీష్ బాబు ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



