ఆయన నా తండ్రి లాంటి వాడు..అందుకే సైలెంట్
on Apr 10, 2025

అర్జున్ రెడ్డి తో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga)ఆయన గత కొంత కాలంగా చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడుతు అర్జున్ రెడ్డి మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు రథన్ చాలా ఇబ్బంది పెట్టాడని,కష్టపడి బతిమాలి వర్క్ చేయించుకున్నట్టుగా మాట్లాడుతు వస్తున్నాడు.
ఈ విషయంపై రీసెంట్ గా రథన్(Radhan)మాట్లాడుతు సందీప్ రెడ్డి వంగ నాకు తండ్రితో సమానం.ఆయన అర్జున్ రెడ్డితో అవకాశం ఇవ్వకపోయి ఉంటే అంత మంచి ఆల్బమ్ వచ్చేది కాదు.అందుకే ఆయన నా గురించి మాట్లాడుతున్నది పట్టించుకోలేదు.నాన్న తిట్టాడని అందరిలోను చెప్పుకోలేం కదా! ఇద్దరి మధ్య విబేధాలు వచ్చినప్పుడు కొన్నింటిని ఏ విధంగా అయితే పట్టించుకోవాలో,అదే విధంగా కొన్ని పట్టించుకోకూడదు.సందీప్ మాట తీరు కొంచం కఠినంగా ఉంటుంది.నాతోనే కాదు అందరితోను అలాగే మాట్లాడతారు.కాకపోతే నేను బాధపడే విషయం ఏంటంటే అర్జున్ రెడ్డి కి సంబంధించి ఫస్ట్ సాంగ్ రికార్డు అయినప్పుడే నాకు నచ్చలేదంటే ప్రాజెక్టు నుంచి వెళ్ళేవాడిని.కాకపోతే అన్ని సాంగ్స్ పూర్తయ్యాక నచ్చలేదని అన్నారు.
ఆ తర్వాత అనుదీప్(Anudeep)తో వర్క్ చేశాను.ఆయన చాలా నిదానం మనిషి.అందరు ఒకేలా ఉండాలని రూల్ లేదు.ఏ మూవీ కైనా మంచి సంగీతాన్ని ఇవ్వడానికి కష్టపడతాను.అర్జున్ రెడ్డి మ్యూజిక్ విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్పకొచ్చాడు.రథన్ కెరీర్ లో ఇప్పటి వరకు'అందాల రాక్షసి,రాధ,మనసుకు నచ్చింది,హుషారు.ఆర్ డి ఎక్స్ లవ్ పాగల్,భజేవాయువేగం ఇలా సుమారు 15 కి పైగా తెలుగు చిత్రాలు ఉన్నాయి.పలు తమిళ,కన్నడ భాషల్లోకి చిత్రాలకి కూడా మ్యూజిక్ ని అందించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



