'కల్కి'కి అండగా రేవంత్ సర్కార్.. నైజాంలో ఒక్క రికార్డు కూడా మిగలదు!
on Jun 23, 2024
'కల్కి 2898 AD' టీంకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. జూన్ 27 న విడుదల కానున్న 'కల్కి 2898 AD' మూవీ టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకోగా.. జూన్ 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు ఐదు షోలకు, టికెట్ ధరల పెంపునకు రేవంత్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ.. విడుదల తేదీ అయిన జూన్ 27న ఉదయం 5:30 స్పెషల్ షోకు అనుమతిచ్చినిచ్చింది ప్రభుత్వం. దీంతో విడుదల రోజు ఆరు షోలు పడనున్నాయి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)