హీరోలని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదు..హనుమాన్ తో రికార్డ్స్ కొట్టాడుగా
on Nov 16, 2024
చిరంజీవి(chiranjeevi)హీరోగా 1998 లో వచ్చిన చూడాలని ఉంది చిత్రం ద్వారా బాలనటుడిగా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన నటుడు తేజ సజ్జా(teja sajja)ఆ తర్వాత దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలందరి సినిమాల్లోను నటించి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందాడు.జాంబీ రెడ్డి, హనుమాన్ చిత్రాలతో సోలో హీరోగా కూడా మారి సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతున్నాడు.ముఖ్యంగా హనుమాన్ తో అయితే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రికార్డు కలెక్షన్స్ ని కూడా సృష్టించాడు.
రీసెంట్ గా అబుదాబి వేదికగా సినీ నటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఐఫా'(iifa)అవార్డు కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి రానాతో పాటు తేజ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.ఇందులో రానా,తేజ కలిసి హీరోలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఈ విషయంపై తేజ మాట్లాడుతూ చిన్నప్పట్నుంచి ఇండస్ట్రీలోనే ఉంటు అందరి హీరోలతో పని చేస్తూ పెరిగాను.వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశ్యం లేదు.అసలు ఆ ఆలోచన కూడా రాదు. వాళ్ళతో మంచి అనుబంధం కూడా ఉంది.మా వ్యాఖ్యలని సరిగా అర్ధం చేసుకోక పోవడం వల్లే తప్పుగా అనుకుంటున్నారు.
అదొక జాతీయ స్థాయి వేడుక. కంటెంట్ కోసం ఎంతో మంది స్క్రిప్ట్ రైటర్స్ వర్క్ చేస్తుంటారు.అన్ని విధాలా చెక్ చేసుకున్న తర్వాతే మాకు స్క్రిప్ట్ లు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కట్ చేసిన క్లిపింగ్స్, ఫుల్ వీడియో చూస్తే ఎవరకి నెగిటివ్ ఉద్దేశ్యం రాదు.రానా నాపై జోకులు వేసాడని అందరకి అర్దమవ్వడంతో వాటిని జోక్ గానే చూసారు. అవకాశం వస్తే మరోసారి ఆ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా ఉంటానని చెప్పుకొచ్చాడు.