మహేష్ తో పాటే అంటున్న తేజ సజ్జ
on Jan 2, 2024

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు తెలుగు వాళ్ళందరు సినిమాల బాట పట్టడం అనే ఆనవాయితీ అనాదిగా వస్తుంది. అసలు సంక్రాంతి పండగ అంటేనే సినిమా అనే నానుడి కూడా ఉంది. ప్రతి సంక్రాంతికి రెండు నుంచి మూడు సినిమాల దాకా రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం అరడజను సినిమాల దాకా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిల్లో తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ కూడా ఒకటి. తాజాగా తేజ తన ట్విటర్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ గురించి చేసిన వ్యాఖ్యలు టాక్ అఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యాయి.
సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా మహేష్ సినిమాకి పోటీగా తేజ సజ్జ సినిమా అనే మాటలు వినపడుతున్నాయి.దీంతో రంగంలోకి దిగిన తేజ తన ట్విటర్ ద్వారా మహేష్ గారితో పోటీగా కాదు మహేష్ తో పాటుగా అని చెప్పాడు. ఇప్పుడు తాను చేసిన ఒక్క ట్వీట్ తో తేజ మహేష్ ఫ్యాన్స్ తో పాటు పలువురి మనసుని చూరగొన్నాడు. 2000 వ సంవత్సరంలో వచ్చిన యువరాజు సినిమాలో తేజ మహేష్ బాబు కొడుకు పాత్రలో నటించాడు. ఇప్పుడేమో మహేష్ గుంటూరు కారం తో పాటుగా తన హనుమాన్ ని రిలీజ్ చేస్తున్నాడు.
కాగా ఇటీవలే హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన హనుమాన్ చిత్రానికి సెన్సార్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో ప్రేక్షకుల్లో హనుమాన్ పై ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. ఈ సంక్రాంతికి హనుమాన్ తో పాటు మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



