ఫిబ్రవరిలో తమన్నా డబుల్ ధమాకా!
on Dec 13, 2021

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సీనియర్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తెలుగులో `భోళా శంకర్`, `ఎఫ్ 3`, `గుర్తుందా శీతాకాలం` చేస్తున్న తమన్నా.. హిందీలో `ప్లాన్ ఎ ప్లాన్ బి`, `బోల్ చుడియాన్` చిత్రాల్లో నటిస్తోంది. ఇవన్నీ కూడా వచ్చే ఏడాది జనం ముందుకు రానున్నాయి.
తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!
ఇదిలా ఉంటే.. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వారాల వ్యవధిలో రెండు సినిమాలతో పలకరించేందుకు సిద్ధమయ్యింది తమన్నా. ఆ వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేశ్ కి జంటగా తమన్నా నటించిన `ఎఫ్ 3` 2022 ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతోంది. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా.. `దిల్` రాజు నిర్మిస్తున్నారు. కాగా, అదే ఫిబ్రవరిలో తమన్నా నటిస్తున్న మరో సినిమా వస్తోంది. అదే.. `గుర్తుందా శీతాకాలం`. కన్నడ చిత్రం `లవ్ మాక్ టైల్`కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్ కి జోడీగా కనిపించనుంది తమన్నా. నాగేశ్వర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తయారవుతోంది.
పాండెమిక్ కూడా విడదీయలేకపోయింది.. మాది ట్రూ ఫ్రెండ్ షిప్!
మరి.. ఒకే నెలలో రాబోతున్న ఈ సినిమాలతో తమన్నా ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



