షారుఖ్ జవాన్ ని చూస్తారు కానీ నా సినిమాని చూడరు!
on Jan 2, 2024
తాప్సీ పన్ను.. ఇటీవలే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకీ చిత్రంలో మెరిసింది. ఆ మూవీలో షారుక్ కి ధీటుగా నటించి అందరి ప్రశంసల్ని అందుకుంది.తాజాగా ఆమె నిర్మాతగా మారి ధక్ ధక్ అనే ఒక చిన్న చిత్రాన్ని నిర్మించింది.ఈ సందర్భంగా ఆ మూవీ విషయంలో తను పడుతున్న కష్టాన్ని తాప్సి వివరించింది.
తాప్సీ మాట్లాడుతూ చిన్న చిత్రాలను థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటిటి లో విడుదల చేద్దామనుకుంటే వాటిల్లో బిగ్ స్టార్‌లు లేనందున సదరు ఓటిటి సంస్థలు పెద్దగా ప్రచారం చేయవు. ఒకవేళ మేకర్స్ రిస్క్ చేసి థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకుంటే ఆ మూవీకి సరైన రిలీజ్ లభించదు. దీంతో అలాంటి మూవీలు గుర్తింపుకి నోచుకోక చివరికి ప్లాప్ చిత్రాలు అనే టాగ్ ని సంపాదిస్తాయి.ఆ తర్వాత ఒక ఎనిమిది వారాల వ్యవధిలో ఓటిటి లో విడుదల చేస్తాం.కానీ ప్రేక్షకులు ఆ మూవీ ఎప్పుడు విడుదల అయ్యింది అని తెలుసుకోవంతో పాటు ఫలితం గురించి తెలిసి వాళ్లంతా తమ సమయం మరియు ఇంట్రెస్ట్ కి తగినది కాదని ఆ మూవీని పక్కన పెట్టేస్తారు.
జవాన్ వంటి పెద్ద సినిమాను థియేటర్లలో చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులు ఆ సినిమాకి ఉన్న స్టార్ కాస్టింగ్ బడ్జట్ దృష్ట్యా సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఓటిటి లో కూడా ఆదరణ లభిస్తుంది. కానీ ఈ చిన్న సినిమాలకి మాత్రం ఆ అవకాశం ఉండదని తాప్సి చెప్పుకొచ్చింది. అలాగే చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఓటిటి హక్కుల ద్వారా నిర్మాణ వ్యయాన్ని మాత్రమే రికవరీ చేస్తారని పబ్లిసిటీ మరియు అడ్వర్టైజింగ్ కి సంబంధించి వారికి ఏమీ మిగలదని కూడా తాప్సీ చెప్పింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
