తాప్సీ ఆ రేసులో లేదంట...!
on Jun 10, 2019

"గ్లామర్ హీరోయిన్‌గా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. లిప్ కిస్సులు పెడతా. డ్యాన్సులు చేస్తా. అయితే... కథలో ఆ పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి. సినిమాలో నా హీరోయిన్ పాత్రను తీసేస్తే ఏం పర్వాలేదన్నట్టు ఉండకూడదు" అని తాప్సీ అన్నారు. తాను గ్లామర్ హీరోయిన్ పాత్రలకు సిద్ధమని చెప్పినా... దర్శకులు, నిర్మాతలు ఆ కోణంలో తనను చూడటం లేదని ఆమె చెప్పారు. ప్రస్తుతం తన దగ్గరకు వస్తున్న కథలు, పాత్రల పట్ల సంతోషంగా ఉన్నానని అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన 'గేమ్ ఓవర్' ఈ నెల 14ల విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీ మీడియాతో మాట్లాడుతూ "నేను కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూ ఉంటే... ఆ రేసులో పరుగులు పెట్టాల్సి వచ్చేది. నీ స్థానం మూడు, నాలుగు అని అందరూ అనేవారు. వైవిధ్యమైన సినిమాలు చేయడం వల్ల నాకంటూ ఒక స్థానం ఏర్పడింది. నా రేసులో నేనే ఉన్నాను. నాదే మొదటి స్థానం" అన్నారు. పిల్లలు కావాలని అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని తాప్సీ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన తన మనసులో లేదని ఆమె అన్నారు. ఇకపై ఏడాదికి ఒక తెలుగు సినిమా చేస్తానని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



