సూర్య నోట 'మహర్షి' డైలాగ్స్!
on Jul 23, 2019

'సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టిని... సక్సెస్ ఈజ్ ఏ జర్నీ' - 'మహర్షి'లో మహేష్ బాబు చెప్పిన డైలాగ్. నిజానికి, ఇంగ్లీష్‌లో పాపులర్ కోట్ ఇది. ప్రముఖ తమిళ హీరో, సింగమ్ సూర్య నోట ఇదే డైలాగ్ వచ్చింది... 'బందోబస్త్' తమిళ్ మాతృక 'కప్పాన్' ఆడియో వేడుకలో. 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్ ప్రధాన పాత్రలు పోషించారు. తీవ్రవాదం, నదీజలాల సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని సూర్య నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు ముందు వచ్చిన సూర్య సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. వాటిని దృష్టిలో పెట్టుకుని 'సక్సెస్ అనేది గమ్యం కాదు... అదొక ప్రయాణం' అని చెప్పి ఉంటారు. 'బందోబస్త్' తమిళ ఆడియో రజనీకాంత్ చేతుల మీదుగా విడుదలైంది. సూర్య తొలి చిత్రం చూసి తనకు నటించడం రాదని అనుకున్నానని, అతణ్ణి అతను గొప్ప నటుడిగా మలచుకుని 'గజినీ', 'శివపుత్రుడు', 'సింగం' వంటి ఎన్నో గొప్ప చిత్రాలు చేశాడని రజనీకాంత్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



