బాలయ్య, చరణ్ ని ఢీ కొడుతున్న సుమంత్!
on Oct 14, 2024
2025 సంక్రాంతికి 'NBK 109'తో నందమూరి బాలకృష్ణ, 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే సంక్రాంతి సమరానికి సై అంటూ సడెన్ గా సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు.
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ చెప్పారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించడం కంటెంట్ మీద నమ్మకమా? లేక ప్రమోషనల్ స్టంట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read