సుధీర్ బాబు, కృతి శెట్టి.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్
on Mar 1, 2021
`ఉప్పెన`తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. బేబమ్మగా జేజేలు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి నేచురల్ స్టార్ నానితో చేస్తున్న `శ్యామ్ సింగ రాయ్` కాగా, మరొకటి సుధీర్ బాబు - ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం.
ఇదిలా ఉంటే.. సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో కృతి చేస్తున్న సినిమాకి సంబంధించి టైటిల్ ని ఈ రోజు సాయంత్రం రివీల్ చేయనున్నారు. అయితే, ఈ లోపే ఆ టైటిల్ వెలుగులోకి వచ్చేసింది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` అనే శీర్షికని ఖరారు చేశారట. మరి.. ఈ టైటిల్ కి సంబంధించి నిజానిజాలెంతో తెలియాలంటే సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మరి.. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో మంచి విజయాలే చూసిన ఇంద్రగంటి.. రాబోయే చిత్రంతోనూ ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
Also Read