అదే జరిగితే పవన్ కళ్యాణ్ ఓజి నే చివరి సినిమా అంటున్న సలార్ శ్రియ రెడ్డి
on Dec 26, 2023

తెలుగు చిత్ర పరిశ్రమ ఒక విచిత్ర పరిశ్రమ..ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఎవరికీ గుర్తింపు వస్తుందో చెప్పలేం. అలాగే ఏ ఏజ్ లో గుర్తింపు వస్తుందో కూడా చెప్పలేం.ఇదంతా ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే 2003 వ సంవత్సరంలో అప్పుడప్పుడే అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రియ రెడ్డి ఇప్పుడు సలార్ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాందించింది. ఆమె 2006 లో కూడా విశాల్ హీరోగా వచ్చిన పొగరు లో లేడీ విలన్ గా కూడా చేసింది.అంటే 20 సంవత్సరాల క్రితం రాని గుర్తింపు శ్రియ కి సలార్ తో ఒక్క సారిగా వచ్చింది. అందుకే చిత్ర పరిశ్రమని విచిత్ర పరిశ్రమ అని అంటారు. వరుస ఇంటర్వ్యూ లతో బిజీ గా ఉన్న ఈమె తాజాగా ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది.
శ్రియ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓజి లో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఓజి లో నాది చాలా మంచి రోల్ దర్శకుడు సుజిత్ నా క్యారక్టర్ ని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడని ఆ సినిమా విషయం లో నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే తన సినిమా కెరీర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. నేను గతంలో నటించిన పొగరు మూవీలో నాకు నటనలో కావలసిన హై మూమెంట్ వచ్చింది అంటే ఆ సినిమాలో నేను పోషించిన పాత్ర పరంగా చాలా చాలా సంతృప్తి చెందాను అందుకే మళ్ళీ సినిమాలు చెయ్యలేదని చెప్పింది.
అలాగే మళ్ళీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చినా కూడా సలార్ లో కూడా నాకు అదే హై మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు ఓజి లో కూడా నాకు అదే మూమెంట్ వస్తే ఆ సినిమాతోనే ఇంక నటించడం ఆపేస్తా అని కూడా శ్రియ రెడ్డి చెప్పింది.ఇప్పుడు ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. ప్రముఖ నటుడు విశాల్ కి శ్రియ రెడ్డి స్వయానా వదిన అవుతుంది. శ్రియ రెడ్డి భర్త విక్రమ్ కృష్ణ విశాల్ అన్నయ్యే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



