ట్రైలర్ రివ్యూ: శ్రీవల్లీ
on Jan 24, 2017

కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన విజయాలు అందుకొన్నారు. ఒకే యేడాది బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ లకు కథలు అందించి ఆ రెండు సంచలన విజయాల వెనుక సూత్రధారిగా నిలిచారు. అలాంటి రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా మారాడంటే... తప్పకుండా ఆసక్తి ఉంటుంది. శ్రీవల్లీ తో ఆయన మెగా ఫోన్ పట్టారు. అయితే విజయేంద్రుడు కెప్టెన్ కూర్చిలో కూర్చోవడం ఇదే తొలిసారి కాదు. ఇది వరకు శ్రీకృష్ణ అనే సినిమా తీశారాయన. అది ఫ్లాప్ అయి కూర్చుంది. ఆ తరవాత నాగార్జునని రాజన్నగా చూపించారు. ఆ ప్రయత్నం కూడా వికటించింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని, రచయితగా మరింత పేరొచ్చాక.. శ్రీవల్లీని తీర్చిదిద్దారు.
ఇదో ఏరోటిక్ సైన్స్ ఫిక్షన్. మనసుల్ని అర్థం చేసుకొని, మనుషుల్ని చదివితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టుకి పునర్జన్మల కథ జోడించారు. ట్రైలర్ చూస్తుంటే... ఈ సినిమాలో ఏదో ఉందన్న విషయం అర్థమవుతూనే ఉంది. ఇది వరకు టీజర్‌లో కాస్త హాట్ హాట్ సీన్స్‌ని చూపించిన విజయేంద్రుడు ఈసారి వాటి జోలికి పోకపోవడం విశేషం. అటు రాజమౌళి ప్రమోషన్లు అందించడానికి రెడీగా ఉన్నాడు. ఇటు ట్రైలర్ కూడా ఓకే అనిపించుకొంది. దాంతో శ్రీవల్లీపై క్రేజ్ పెరిగింది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



