పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదంటున్న శృంగార నటి
on Oct 17, 2023

తెలుగు ,తమిళ బాషలలో 150 కి పైగా సినిమాల్లో నటించిన నటి సోనా. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అండ్ వాంప్ క్యారక్టర్ లో నటించిన సోనా ఇప్పుడు దర్శకురాలిగా మారి స్మోక్ అనే వెబ్ సిరీస్ ని తెరకేక్కించింది. స్మోక్ కి సంబందించిన ప్రమోషన్స్ లో బాగంగా ఆమె తన సినీ జర్నీ కి సంబంధించిన కొన్ని విషయాలని మీడియా తో పంచుకుంది.ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
సోనా అంటే ఎవరికీ అంతగా తెలియకపోవచ్చు గాని ఆమె పిక్ ని చూస్తే మాత్రం గుర్తుపడతారు. కొన్ని కొన్ని సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్ని పోషించింది గాని జీవా హీరోగా వచ్చిన రంగం మూవీ లో ని పాత్ర మాత్రం సోనా కి మంచి గుర్తింపుని తెచ్చింది. ఆ మూవీ లో కోట శ్రీనివాసరావు గెలవడం కోసం సోనా ప్రచారం చేస్తుంది. ఆమె పోషించిన క్యారక్టర్ ని బేస్ చేసుకొని సోషల్ మీడియా లో రక రకాల వ్యక్తుల మీద మీమ్స్ కూడా వచ్చాయి వస్తూనే ఉన్నాయి కూడా.. ఇక అసలు విషయానికి వస్తే సోనా సినిమా పరిశ్రమలో ఎదుర్కున్న అవమానాలు అలాగే తన మీద వచ్చిన అనుమానాల గురించి కూడా చెప్పుకొచ్చింది. తన మీద ముద్ర పడిన శృంగార తార అనే పిలుపు నుంచి బయటకి రావటానికి చాలా ప్రయత్నించానని, సినిమా పరిశ్రమలో 2000 వ సంవత్సరం లో అడుగుపెట్టానని కాని ఎందుకో తెలియదు మొదటి నుంచి నాకు శృంగార పాత్రలే వచ్చాయి అని చెప్పింది. చాలా సార్లు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నానని ఒక్కోసారి నాకు ఎందుకు అలాంటి పాత్రలే వస్తున్నాయని కూడా ఆలోచించానని చెప్పింది. పుట్టుకతో ఎవరు చెడ్డ వారు కాదని వాళ్ళు పెరిగిన పరిస్థితులు ఎదురుకున్న సమస్యలు ఆధారంగా వాళ్ళ జేవితలు మలుపు తిరుగుతాయి అని కూడా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సోనా తన దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న స్మోక్ అనే మూవీ లో 99.9 % తన జీవితంలో తాను ఎదురుకున్న సంఘటనలనే తెరకేక్కిస్తుంది. పైగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ తర్వాత తనకి కొన్ని ఇబ్బందులు వస్తాయని వాటిని ఎదుర్కోవడానికి సిధంగా ఉన్నానని కూడా సోన చెప్పింది. రేపు స్మోక్ విడుదల అయ్యాక ఎన్ని సంచలనాన్ని సోనా సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



