అల్లరి నరేష్ తో సితార మూవీ!
on Jun 30, 2024
ఒకప్పుడు కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్ (Allari Naresh).. ఇప్పుడు విభిన్న చిత్రాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం ''బచ్చల మల్లి" సినిమాతో బిజీగా ఉన్న నరేష్.. తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందనుండటం విశేషం.
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న "మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు" అంటూ సితార సంస్థ ఈ సినిమాని ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో క్రియేటివ్ గా ఉంది.
"ఫ్యామిలీ డ్రామా" ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లరి నరేష్ యొక్క 63వ చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)