సితార బోల్డ్ మూవీ.. డైమండ్ ని పక్కన పెట్టేశారా?
on Jul 6, 2025
"If middle finger was a man" అంటూ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను జూలై 9న రివీల్ చేస్తామని తెలిపింది. ఇదొక సినిమా అనౌన్స్ మెంట్ అని అర్థమవుతూనే ఉంది. అయితే అది ఏ సినిమా అనేదే ఇక్కడ ఆసక్తికరం.
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో మరో సినిమాకి శ్రీకారం చుట్టింది సితార. రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేయనున్న ఈ ఫిల్మ్ కి 'బ్యాడాస్' (BADASS) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు సమాచారం.
నిజానికి సిద్ధు-రవికాంత్ కాంబినేషన్ లో గతేడాది 'కోహినూర్' అనే సినిమాని ప్రకటించింది సితార సంస్థ. 'కోహినూర్' డైమండ్ కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంది. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు అదే కాంబోలో 'బ్యాడాస్' సినిమా రాబోతుంది. ఇది సినిమా(సినీ పరిశ్రమ) గురించి తీస్తున్న సినిమా కావడం విశేషం. ఈ మూవీ బోల్డ్ గా ఉంటుందని టాక్. కాగా, గతంలో సిద్ధు-రవికాంత్ కాంబోలో 'కృష్ణ అండ్ హిజ్ లీలా' అనే సినిమా వచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
