లిప్ లాక్ ఒక్కటే... టేకులు 19!!
on Sep 17, 2018
తెలుగులో 'అధర చుంబనం' అంటుంటారు. ఇంగ్లిష్లో 'లిప్ కిస్' అని, 'లిప్ లాక్' అని అంటుంటారు. 'ఫ్రెంచ్ కిస్' అని స్టైలుగా సెలవిస్తారు. పిలుపు ఏదైనా పని ఒక్కటే... అమ్మాయి పెదవులపై తన పెదవులతో అబ్బాయి తాళం వేయడం, అధరామృతాన్ని జుర్రేసుకోవడం! కొన్నేళ్ల క్రితం వరకూ హిందీ సినిమాల్లో ఎక్కువగా లిప్ లాక్ సన్నివేశాలు కనిపించేవి. ఇటీవల తెలుగు, తమిళ సినిమాల్లోకి లిప్ లాక్ ట్రెండ్ వచ్చేసింది. కొత్త తమిళ సినిమా 'రాజా రంగుస్కి'లోనూ లిప్ లాక్ సన్నివేశాలు వున్నాయి. ఒక్క లిప్ లాక్ కోసం హీరో శిరీష్ 19 టేకులు తీసుకున్నారట అని తమిళ ఇండస్ట్రీ గుసగుస. అట కాదు... నిజమే అని హీరోయిన్ చాందిని సెలవిచ్చారు. తెలుగులో 'కాళి చరణ్', 'లవర్స్', 'చిత్రం భళారే విచిత్రం' సినిమాల్లో చాందిని నటించారు. రెండేళ్లుగా తమిళ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. 'రాజా రంగుస్కి' త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లిప్ లాక్ కోసం హీరోగారు 19 టేకులు తీసుకున్న విషయాన్ని బయటపెట్టారు. హీరో శిరీష్ కావాలని అన్ని టేకులు తీసుకున్నారా? అంటే... కాదట! పర్ఫెక్షన్ కోసమే 19 టేకులు తీసుకున్నాడని చాందిని చెప్పారు.
Also Read