ఎందుకు అబద్దాలు రాస్తారు?
on Sep 13, 2017

అసలు ఆ వార్తలో నిజమే లేదు. చేస్తోందే తెలుగులో మొదటి సినిమా. అప్పుడే రూమర్లా? అంటోంది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. ‘సాహో’లో తాను డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త గత కొన్ని రోజులుగా హల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ లో పాల్గొన్న శ్రద్ద.. ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘ఈ సినిమాలో నాది డ్యూయెల్ రోల్ అనీ.. ఒకటి భయపడే పాత్రైతే.., ఒకటి భయపెట్టే పాత్ర అని.. ఏంటేటో రాశారు. అందులో ఏ మాత్రం నిజం లేదు. ‘సాహో’లో చేస్తున్నది ఒకే రోల్. చాలా మంచి రోల్. మరో విషయం ఏంటంటే... నేను నటిస్తున్న తొలి బహుభాషా చిత్రం ఇదే. చాలా ఆనందంగా ఉంది. లొకేషన్లో తెలుగు, హిందీ భాషల్లో సన్నివేశాలు తీస్తున్నారు. అందుకే... తెలుగు ఈజీగా అర్థమవుతోంది. తెలుగు భాషను ఎలా ఫేస్ చేయాలా? అని భయపడ్డాను. ఇప్పుడు మనసు కాస్త తేలిక పడ్డది. నిజం చెబుతున్నాను... తెలుగును ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పింది శ్రద్ధ. శ్రద్ధ కపూర్ తో నటింపజేయడానికి గతంలో చాలామంది తెలుగు దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ... అన్ని బెడిసికొట్టాయ్. ‘సాహో’ సినిమాతో అది సాథ్యం అయ్యింది. మరి ఈ బాలీవుడ్ అందం.. టాలీవుడ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



