రిచెస్ట్ హీరో షారుఖ్ ఖాన్
on May 23, 2014
.jpg)
బాద్‌షా, కింగ్‌ఖాన్ ఇవి షారుఖ్ ఖాన్‌ని ఇష్టపడే వారు పిలుచుకునే పేర్లు. ఆ పేర్లకు తగ్గట్టుగానే ఆయనకు కితాబులు లభిస్తున్నాయి. ప్రపంచంలోని రిచెస్ట్ సినీ స్టార్‌ల లిస్ట్‌లో బాద్‌షా రెండో స్థానంలో ఉన్నాడనే విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్‌లను కలిపి తయారు చేసిన ఈ లిస్ట్‌లో షారుఖ్ ఖాన్ సెకెండ్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాను వెల్త్-ఎక్స్ అనే ప్రముఖ సంస్థ హాలీవుడ్ బాలీవుడ్ రిచెస్ట్ లిస్ట్ పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో హాలీవుడ్ కమెడియన్ జెర్రీ సీన్ ఫీల్డ్ 82 కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, 60 కోట్ల డాలర్లతో బాద్‌షా రెండవ స్థానంలో ఉన్నారు. భారత సినీ పరిశ్రమ నుంచి ఈ పట్టికలో చోటు సంపాదించుకున్న తొలి భారతీయ సెలబ్రిటీ షారుఖే. ప్రముఖ హాలీవుడ్ హీరోలను తోసి రాజని షారుఖ్ ఈ స్థానాన్ని సంపాదించడం ఇప్పుడు హాలీ, టాలీవుడ్‌లలో హాట్ టాపిక్. హీరో, ఐపీఎల్ టీం ఓనర్, టీవీ వ్యాఖ్యాతగా ఆయనకు లభించే ఆదాయాలన్ని లెక్కలోనికి తీసుకున్నట్లు తెలుస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
