సావిత్రి 90వ జయంతి సభ.. 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం!
on Nov 28, 2025

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలను ‘సావిత్రి మహోత్సవ్' పేరిట హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి కీలక ప్రకటన చేశారు. (Mahanati Savitri)
“మా మాతృమూర్తీ, మహానటీ అయిన శ్రీమతి సావిత్రి గారి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1 నుంచి 6 వరకు ‘సావిత్రి మహోత్సవ్' పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ “సంగమం” ఫౌండేషన్ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్ 1 నుంచి 5 వరకు సావిత్రి గారి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్ 6న జరిగే సావిత్రి 90వ జయంతి సభలో 'మహానటి' చిత్ర దర్శక నిర్మాతలైన నాగ్ అశ్విన్, ప్రియాంకాదత్, స్వప్నాదత్ లనూ, 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక రచయిత సంజయ్ కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లనూ ప్రత్యేకంగా సత్కరిస్తున్నాము. మండలి బుద్ధప్రసాద్ గారి అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు” అని విజయచాముండేశ్వరి పేర్కొన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



