మహేష్ బాబుతో పాటు నటకిరీటి కూడా....
on Jul 8, 2019
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేష్బాబు ఆర్మీ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి హిట్ 'ఎఫ్2' తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీరులో జరుగుతోంది. ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే... మహేష్ బాబుతో పాటు నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా 'సరిలేరు నీకెవ్వరు'లో ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. కాశ్మీర్ షెడ్యూల్ లో ఆయన కూడా పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు లోపు ఈ షెడ్యూల్ పూర్తవుతుందట. తర్వాత హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన ట్రైన్ సెట్ లో షూటింగ్ చేయనున్నారు. ప్రతి సినిమాను చిక చిక వీలైనన్ని తక్కువ రోజుల్లో పూర్తి చేసే అనిల్ రావిపూడి, ఈ సినిమాను త్వరగా పూర్తి చేయనున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కామెడియన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారు. రేష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.