విశాల్ 9 కోట్లకు బుక్కయ్యాడు
on Sep 28, 2015
శరత్‌కుమార్ Vs విశాల్... ప్రస్తుతం తమిళ నడిగర సంఘం ఎన్నికల తీరు చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య యుద్ధం నడుస్తున్నట్టే ఉంది. ఈ ఎన్నికల్లో గెలుపుని వ్యక్తిగత విజయంగా భావించిన ఈ సినీ నటులిద్దరూ తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇరు వర్గాల మధ్య అక్కడ ఆసక్తికరమైన పోరు నడుస్తుండడంతో విజయం కోసం ఇటు శరత్‌కుమార్, అటు విశాల్ ఇద్దరూ నువ్వా నేనా అంటూ ఢీ కొట్టుకొంటున్నారు. ఒకరిపై మరొకరు పరస్పన ఆరోపణలు చేసుకోవడానికి కూడా వెనుకంజ వేయడం లేదు.
'తాజాగా.. విశాల్ చేసిన ఆరోపణలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. నడిగర సంఘం ప్రస్తుత అధ్యక్షుడు శరత్‌కుమార్ గతంలో చాలా అవకతవకలు చేశారని, నిధుల దుర్వినియోగం జరిగిందని, కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని.. విశాల్ ఆరోపణలు చేశాడు. వీటిపై శరత్ కుమార్ కూడా తీవ్రంగా స్పందించాడు. విశాల్ తన పరువుకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నాడని, ప్రజల సమక్షంలో తనకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని, ఆ రూపంలో విశాల్ తనకు 9 కోట్ల రూపాయలు చెల్లించాలని హచ్చరిస్తూ. కోర్టు నోటీసులు పంపాడు. మరోవైపు విశాల్... తాను ఎవ్వరికీ క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని భీష్మించుకొని కూర్చున్నాడు.
మరి శరత్ కుమార్ ఎలాంటి స్టెప్పు వేస్తాడో, అందుకు విశాల్ ఎలా జవాబు చెబుతాడో అని.. తమిళనాట సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.