ట్రోల్ల్స్ ఆపండయ్య బాబు..భీముడు వారసుడి గురించి విష్ణు చెప్తున్నాడు
on Jul 23, 2024
మంచు విష్ణు(vishnu)మోహన్ బాబు(mohan babu)ల ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa)పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న కన్నప్ప కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తు ఉంది. ఇటీవల వచ్చిన టీజర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అంతే కాకుండా ఈ సారి మంచు వారు హిట్ కొట్టబోతున్నారనే హామీని అభిమానులతో పాటు ప్రేక్షకులకి ఇచ్చినట్టయ్యింది. విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా మెస్మరైజ్ చెయ్యబోతున్నాయనే క్లారిటీ కూడా వచ్చేసింది. లేటెస్ట్ గా కన్నప్ప నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అది అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు కన్నప్ప స్థాయిని చాటి చెప్తుంది.
శరత్ కుమార్(sarath kumar)ఒకప్పటి తమిళ అగ్ర నటుడు. ప్రెజంట్ తన సెకండ్ సినీ జర్నీలో ఎన్నో మంచి పాత్రలని పోషిస్తు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కన్నప్ప లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తున్నాడు. నాద నాధుడు అనే కోయ దొర గా కనిపించబోతున్నాడు. ఈ నాద నాధుడు ఎవరో కాదు మహాభారతంలోని పాండు పుత్రుల్లో ఒకరైన భీముడి వారసత్వానికి చెందిన సంతతి. ఆది పర్వంలో పాండవులు వన వాసం చేసేటప్పుడు ఒక అడవిలోని కొంత ప్రాంతాన్ని హిడింబా అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండే వాడు. ధర్మం కోసం భీముడు అతన్ని చంపి ఆమె సోదరి అయిన హిడింబి ని వివాహమాడతాడు. ఆ వంశానికి చెందిన వ్యక్తే నాద నాధుడు.
ఇక కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అనే దాని మీద కూడా విష్ణు ట్వీట్ చేసాడు. డిసెంబర్ నెలలోనే వస్తామని ప్రకటించాడు. ఇక ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇంత వరకు తెరకెక్కని కాంబినేషన్ తో కన్నప్ప తెరకెక్కుతుంది. ప్రభాస్(prabhas)మోహన్ లాల్(mohan lal)అక్షయ్ కుమార్(akshay kumar)మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ లు ముఖ్య పాత్రల్లో మెరిశారు. స్టీఫెన్ దేవస్సి సంగీతం అందించగా ముకేశ్ కుమార్ సింగ్(mukesh kumar singh)దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read