సంపూర్ణేష్ బాబుకి జోడీగా రాజమౌళి హీరోయిన్..!!
on Jul 10, 2018
రాజమౌళి.. అపజయం ఎరుగని దర్శకుడు.. కామెడీ హీరో సునీల్ నుండి స్టార్ హీరోల వరకు, ఏ హీరోతో సినిమా చేసినా హిట్ కొట్టాడు.. ఆఖరికి ఈగ సినిమాతో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు.. అలాంటి రాజమౌళిని మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే సింహాద్రి అనో, బాహుబలి అనో చెప్పడు.. సింపుల్ గా 'మర్యాద రామన్న' అని చెప్తాడు.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్నలో సునీల్, సలోని హీరో హీరోయిన్లుగా నటించారు.. సలోని పేరుకి రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా చేసిందనే కాని తరువాత చెప్పుకోదగిన అవకాశాలు రాలేదు.. దాంతో అడపాతడపా క్యారక్టర్ పాత్రలు చేస్తూ కాలం నెట్టుకొస్తోంది.. ఈ సమయంలో సలోనికి హీరోయిన్గా ఓ అవకాశం వచ్చింది.. కాకపోతే అగ్ర హీరోతో కాదు.. హృదయ కాలేయం తో మన హృదయాలను పిండి పిప్పి చేసిన సంపూర్ణేష్ బాబుతో.. జె జె ప్రకాష్ రావు దర్శకత్వంలో సంపూర్ణేష్, సలోని జంటగా ఒక సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకి 'టక్కరి దొంగ చక్కని చుక్క' అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.. చూద్దాం సంపూ, సలోనిల జంట తెరమీద ఎలా సందడి చేస్తుందో ఏంటో.