పవన్‌ని ఇంకా నమ్ముతున్నాడు
on Nov 3, 2014
గబ్బర్ సింగ్ 2 సినిమా విషయంలో సంతప్‌నందికి చుక్కెదురు అయ్యింది. ఈ సినిమా కోసం సంపత్ దాదాపు రెండేళ్లు ఎదురుచూశాడు. పవన్ అభిరుచికి తగ్గట్టు స్ర్కిప్టులో మార్పులు కూడా చేశాడు. కానీ.. ఈ సినిమా నుంచి సంపత్ నందిని తప్పించి మరో దర్శకుడు (బాబిని అనుకొంటున్నారు) ఎంచుకొన్నారని వార్తలొస్తున్నాయ్. అయితే చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దాంతో సంపత్‌నందిలో ఆశలూ చావలేదు. ''ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకొన్నా. ఇంత కాలం వెయిట్ చేశా. పవన్ కల్యాణ్‌పై నమ్మకం ఉంది. ఆయన నన్ను మోసం చేయరు'' అని సంపత్ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. పవన్‌కి ఇంకా నమ్ముతున్నాడట. త్వరలోనే పవన్‌ని కలుస్తానని, గబ్బర్ సింగ్ 2 పూర్తి స్ర్కిప్టు చదివి వినిపిస్తానని, పవన్ ఓకే అంటాడన్న నమ్మకం ఉందని చెప్తున్నాడట. అయితే సంపత్ నంది సన్నిహితులు మాత్రం... అతన్ని వారిస్తున్నారు. పవన్‌ని కలిసి లాభం లేదని, రవితేజ సినిమాపై దృష్టిపెట్టడం కంటే గత్యంతరం లేదని చెప్తున్నారట. కానీ సంపత్‌లో ఆశలు చావలేదు. మరి పవన్, సంపత్‌నంది మొర ఆలకిస్తాడో, లేదో చూడాలి.