సమంతకు డబ్బులు ఇచ్చి చైతన్య పోస్ట్ చేయించాడా?
on May 22, 2020
అక్కినేని కోడలు సమంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ చూశారా? భర్త నాగచైతన్య ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... అందులో చైతన్య చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. బుధవారం త్వరలో ఒక్కటి కాబోయే దంపతులు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ రోకా ఫంక్షన్ జరిగింది కదా! దానికి చైతన్య, సమంత దంపతులు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెండు నెలల తర్వాత చక్కగా డ్రెస్ అప్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు... చైతన్య సోలో ఫోటోకి పెద్ద క్యాప్షన్ ఇచ్చారు.
"అమ్మకి, ఆంటీలకు, సిస్టర్ అండ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ లో మగవాళ్లకు పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వంతు వచ్చింది. చూడండి... నా భర్త చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా??" అని సమంత పేర్కొన్నారు. బ్రాకెట్ లో "మా ఆయన ఎప్పుడు ఎక్కడో పెద్ద గొయ్యి తవుతున్నాడు... అందులో దూకు వేయడానికి" సరదాగా కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ కింద చైతన్య చేసిన కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. "ఇప్పుడు ఓకే... ఇది పెయిడ్ పార్ట్నర్ షిప్ పోస్టులలో ఒకటి కింద ఉంది" అని చైతన్య పేర్కొన్నారు. పెయిడ్ పార్ట్నర్ షిప్ అంటే డబ్బులు ఇచ్చి పోస్ట్ చేయించుకోవడం అన్నమాట.