సాయిధరమ్‌తేజ్ ‘సుప్రీమ్’ మొదలైంది
on Sep 23, 2015
‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాల తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 21 చిత్రం ‘సుప్రీమ్’ బుధవారం ఉదయం హైదరాబాద్‌లో దిల్‌రాజు కార్యాలయంలో ప్రారంభమైంది. ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ క్లాప్ కొట్టగా, నందమూరి కళ్యాణ్‌రామ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ హరీష్‌శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా...
సుప్రీం హీరో సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ '''పిల్లా నువ్వులేని జీవితం' సినిమా నుండి దిల్‌రాజుగారితో మంచి పరిచయం ఏర్పడింది. ఆయనతో ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయనతో ఎప్పుడైనా సినిమా చేయడానికి నేను రెడీయే. ‘సుప్రీమ్’సినిమా స్టోరి లైన్‌ను నేను అమెరికాలో ఉన్నప్పుడు దిల్‌రాజుగారు ఈ సినిమా లైన్ చెప్పారు. ఇండియా రాగానే ఈ కథ విన్నాను. నాకు చాలా బాగా నచ్చింది. ఎలాగైనా ఈ కథను మిస్ చేయకూడదనే స్వార్థంతో ఈ సినిమా చేస్తున్నాను. అనిల్ రావిపూడిగారు ఎక్సలెంట్‌గా నెరేట్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనింగ్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి'' అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ''మా బ్యానర్‌లో 'పిల్లా నువ్వులేని జీవితం', ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల తర్వాత సాయిధరమ్ చేస్తున్న మూడో చిత్రం. తేజ్ నటించిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రం తర్వాత చేస్తున్న చిత్రమిది. 'పటాస్' సినిమా సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆలోచలను కలిశాయి. ఆ సమయంలో నాకు అనిల్ ఈ లైన్ ను చెప్పాడు. నాకు నచ్చింది. అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ టైంలో ఈ పాయింట్ తేజ్‌కి చెప్పాను. ఇండియా రాగానే కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఎన్నో కథలు విన్నాను కానీ ఇలాంటి డిఫరెంట్ పాయిం ట్‌ను వినలేదు సర్ అని అన్నాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం రేపు(సెప్టెంబర్ 24న) గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ కాపీ చూశాం. సినిమా చాలా సూపర్‌గా ఉంది. హరీష్ సినిమాని ఎక్సలెంట్‌గా ప్రెజంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ‘సుస్వాగతం’ సినిమాతో సక్సెస్ కొట్టాడు. అలాగే ప్రభా స్‌కి కూడా ‘వర్షం’ మూడో సినిమా, తను కూడా ఆ సినిమాతో స్టార్ అయ్యాడు. ఇప్పుడు సాయి మా బ్యానర్‌లో చేస్తున్న మూడో సినిమా ‘సుప్రీమ్’కచ్చితంగా స్టార్ అవుతాడు. ఒకప్పుడు చిరంజీవిగారిని అందరూ సుప్రీంహీరో అనేవారు ఆ టైటిల్‌ను మేం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో తేజ్‌కి ఉపయోగించాం. ఇప్పుడు ఆ టైటిల్‌తో ‘సుప్రీమ్’ సినిమా చేయడం హ్యపీగా ఉంది. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ ఇంకా పెద్ద స్టార్ అవుతాడు’’ అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ''నాకు దిల్‌రాజుగారితో 'పటాస్' సినిమా నుండి జర్నీ స్టార్టయింది. ఈ సినిమాకి మంచి స్క్రిప్ట్ కుదిరింది. ‘పటాస్’ సినిమాలాగానే ఈ సినిమా కూడా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ విత్ ఫీల్ గుడ్ లేయర్. ఇందులో హీరో ఒక క్యాబ్ డ్రైవర్. అందుకే ఈ సినిమాకి ‘డోన్ట్ సౌండ్ హార్న్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. అక్టోబర్ 5 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. సినిమాని రెండు షెడ్యూల్స్ లో పూర్తి చేస్తాం. మొదటి షెడ్యూల్‌ను అక్టోబర్ 5 నుండి నవంబర్ 15 వరకు ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ డిసెంబర్, జనవరి నెలల్లో పూర్తి చేస్తాం. ఫ్రిభ్రవరిలో సాంగ్ షూట్ ఉంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు, మెగాభిమానులు సంతోషపడేలా అన్నీ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’అన్నారు.
సాయిధరమ్‌తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో సాయికుమార్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, కబీర్ సింగ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయిప్రకాష్; సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ డైరెక్టర్: ఎ.యస్.ప్రకాష్, ఫైట్స్: వెంకట్, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి.