సూపర్ స్టార్‌ని ఫిదా చేసిన సాయి పల్లవి!!
on Mar 5, 2019
తెలుగుతో పాటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుతపుతోంది సాయి పల్లవి. అందం, అభినయం కలగలిపిన నటి కావడంతో ఆమెకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో మలర్ గా పాపులరైంది సాయి పల్లవి. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదాతో అందర్నీ ఫిదా చేసింది. ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడం తనకు మంచి పేరు రావడంతో వరుసగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇటీవల రౌడీబేబీగా తమిళ ప్రేక్షకులను రఫ్పాడించింది. తన డాన్స్ లతో మతి పోగొట్టి అక్కడ కూడా మంచి చాన్స్ లు కొట్టేస్తోంది. స్టోరీ లో కొత్తదనం ఉంటే చాలు హీరో ఎవర్నది చూడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందట. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సాయి పల్లవి గురించిన ఒక వార్త తెలుగులో హల్ చల్ చేస్తోంది. మహేష్ బాబు సరసన ఆమె నటించే చాన్స్ కొట్టేసిందట. ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాను వంశీ పైడి పల్ల దర్శకత్వంలో చేస్తున్నాడు. దీన్ని తర్వాత తన 26వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న వార్తలు వస్తోన్న సంగతి తెలిసందే. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నారట. కథ వినిపించడానికి దర్శకుడు ఇటీవల చెన్నై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Also Read