సదా పెళ్లి చేసుకునేవాడికి ఆ అర్హతలు ఉంటే చాలంట!
on Jun 9, 2023
సదా అని పిలవబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్.. తెలుగు సీనీ పరిశ్రమలో 'జయం' మూవీతో అరంగేట్రం చేసి మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది. అల్లరి నరేష్ తో కలిసి 'ఊపిరి' సినిమాలో నటించింది. జయం, నాగ, లీలా మహల్ సెంటర్, దొంగ-దొంగది, ఔనన్న కాదన్నా, చుక్కల్లో చంద్రుడు, వీరభద్ర, క్లాస్ మేట్స్, శంకర్ దాదా జిందాబాద్, టక్కరి, అపరిచితుడు, యమలీల 2 మొదలగు సినిమాలలో నటించిన సదా.. తన సినిమా కెరీర్ లో 'జయం' మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సదా ముంబై లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసి అక్కడే తన జ్ఞాపకాలు ఉన్నాయంటూ ఈ మధ్యకాలంలో ఎమోషనల్ అవుతూ ఒక వ్లాగ్ ని చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సినిమాలలో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న సదా.. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. 'ఢీ' డాన్స్ షోకి శేఖర్ మాస్టర్ తో కలిసి జడ్జ్ గా వ్యవహరించగా వీళ్ళిద్దరి జడ్జిమెంట్ అంటే ఎంటర్‌టైన్మెంట్ కి కేరాఫ్ గా ఉంటుంది. బిబి జోడికి జడ్జిగా చేసి ఆ షోకి మరింత క్రేజ్ వచ్చేలా చేసింది సదా. అయితే సదాకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. అంతే కాకుండా సదా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన అప్డేట్ ని ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తోంది.
తాజాగా సదా తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా మంది తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడుగుతున్నారని దానికి సమాధానమిచ్చింది. "ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకే పెళ్లి ఎప్పుడు అంటూ క్వశ్చన్స్ వేస్తున్నారు.. నేను చెప్పేది ఏంటంటే నేను చేసుకునే అతను నాకు సపోర్ట్ చేయగలగాలి. నన్ను అర్థం చేసుకోవాలి.
అలా అర్థం చేసుకునే వారు కొంతమందే ఉంటారు...ఇద్దరిలో ఎవరో ఒకరు అడ్జెస్ట్ అవ్వాలి. నాకు నచ్చినట్లు నేను ఉండాలి. నాకు అడవికి వెళ్ళి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీయడమంటే ఇష్టం. తాజాగా కొంతమంది పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంటే మరికొంత మంది డివోర్స్ ని సెలెబ్రేట్ చేసుకోవడం విన్నాను.. డెఫనెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అడ్జెస్ట్ అవలేకపోతే సపరేట్ అవడం బెస్ట్" అంటూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేసింది సదా. కాగా ప్రస్తుతం సదా.. ఈ ఆదివారం స్టార్ మా టీవీలో గ్రాండ్ గా లాంచ్ అవుతోన్న 'నీతోనే డాన్స్ షో' కి జడ్జ్ గా చేస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
