ENGLISH | TELUGU  

అఫీషియల్.. 'SSMB 29' షూట్ ఎప్పుడంటే..?

on Oct 10, 2024

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేయనున్న సంగతి తెలిసిందే. హీరోగా మహేష్ కి ఇది 29వ చిత్రం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడొస్తాయా? అని అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలై రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు రాజమౌళి ఈ సినిమా షూట్ ని స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. (SSRMB)

'SSMB 29' షూటింగ్ 2025 జనవరి నుంచి మొదటి కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెలిపారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ కు 'SSMB 29'కి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. జనవరి నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇది మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.