పవన్ కళ్యాణ్‌కూ నోట్ల కష్టాలు..!
on Nov 16, 2016
.jpg)
కేంద్రం ప్రభుత్వం పెద్ద నోట్ల ప్రకటన దేశంలోని అన్నిరంగాలపై పెను ప్రభావం చూపుతోంది. రూ.500, 1000 నోట్లు చెల్లకపోవడంతో నిత్యావసరాలు కొనలేక సామాన్యలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. పాత నోట్లు మార్చి కొత్త నోట్లు తీసుకునేందుకు జనం పనులు, తిండి, తిప్పలు మాని బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఇలా దాదాపు వారం రోజుల నుంచి భారతీయుల విలువైన సమయమంతా బ్యాంకుల్లోనే గడిచిపోయింది. మొదట్లో కాస్త అడ్జెస్ట్ అయినా ఈ నోట్ల తిప్పలు ప్రముఖులను తాకాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ 90 ఏళ్ల వయసులో బ్యాంకుకు వచ్చి నోట్లు మార్చుకోగా..
ఇప్పుడు టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆ జాబితాలోకి చేరారు. పవన్ హైదరాబాద్‌లోని ఓ బ్యాంకు వద్దకు వచ్చి తన వద్దనున్న పెద్ద నోట్లను మార్చుకున్నారు. పవన్ బ్యాంకులో కూర్చుని ఫాం నింపుతున్న ఫోటో ఒకటి ప్రజంట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇదిలా ఉంటే బ్యాంకుకు వచ్చిన పవన్‌ని చూసేందుకు జనం ఎగబడ్డారు. అయితే తాను ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బ్యాంకు సిబ్బందిని ఇబ్బంది పెట్టినట్లవుతుందని పవన్ త్వరగా అక్కణ్ణుంచి వెళ్లిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



