వైరల్ అవుతున్న రోజా రొయ్యల పులుసు
on Mar 15, 2025
చిరంజీవి(Chiranjeevi)బాలకృష్ణ(Balakrishna)నాగార్జున(Nagarjuna)వెంకటేష్(venkatesh)వంటి అగ్ర హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన రోజా(Roja)తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.రీఎంట్రీలోను అవకాశం కుదిరినప్పుడల్లా ప్రాముఖ్యత గల క్యారక్టర్ లని పోషిస్తు వస్తుండటమే కాకుండా పలు టివి షోస్ కూడా చేస్తు అభిమానులని అలరిస్తుంది.కళామతల్లి ఇచ్చిన గుర్తింపుతో రాజకీయాల్లోకి కూడా ప్రవేశించి మంత్రిగా కూడా పని చేసారు.
రీసెంట్ గా తెలంగాణ(Telangana)అసెంబ్లీ సమావేసాలు జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రతి పక్ష నాయకుడు కేసిఆర్(Kcr)ని ఉద్దెశించి మాట్లాడుతు కేసిఆర్ ముఖ్యమంత్రి తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం జూడాల నుంచి తెలంగాణాకి రావాల్సిన నీటి విషయంలో అన్యాయం జరిగింది.రాయలసీమ(Rayalaseema)కి నీటిని తీసుకుపోతుంటే అప్పటి ప్రభుత్వాన్ని నిలదీయకుండా రోజా ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిన్నాడు.రాయలసీమని రతనాల సీమ చేస్తానని కూడా చెప్పొచ్చాడని రేవంత్ రెడ్డి మాట్లాడటం జరిగింది.
దీంతో రోజా రొయ్యల పులుసు అంటు సోషల్ మీడియాలో వార్త వస్తుండటంతో సినీ అభిమానుల్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
