కాంతార చాప్టర్ 1 వెనక ఉన్న రహస్యం ఇదే.. మరి రిషబ్ శెట్టి గొప్ప ఏంటి!
on Sep 26, 2025

అభిమానులతో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కాంతార పార్ట్ 1'(Kantara Chapter 1). ఘన విజయాన్ని అందుకున్న 'కాంతార' కి సీక్వెల్ కావడంతో పాటు, కాంతార కంటే ముందు జరిగిన కథని చెప్పబోతున్నారు. దీంతో పార్ట్ 1 లో కథనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ భారతీయ ప్రజలు దైవంగా కొలిచే 'పంజర్లీ' దైవం కాంతార కి ప్రధాన శక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ గెటప్ లో 'రిషబ్ శెట్టి ' పెర్ ఫార్మెన్స్ చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇప్పుడు పార్ట్ 1 లో కూడా పంజర్లీ దైవం ప్రధాన ఆకర్షణంగా ఉండనుండంతో పాటు, మరోసారి ఆ గెటప్ లో రిషబ్ శెట్టి మెస్మరైజ్ చెయ్యబోతున్నాడు. శివుడిగా కనిపించబోతుండటం కూడా ప్రధాన ఆకర్షణ గా నిలవనుంది
రీసెంట్ గా 'రిషబ్ శెట్టి'(Rishab Shetty)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నేను భగవంతుడ్ని బాగా నమ్ముతాను. అందుకే ఆ సన్నివేశాలని తెరకెక్కించేటప్పుడు చాలా నియమాలు పాటించాను. మాంసాహారం తీసుకోలేదు. కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు. ఇతరుల నమ్మకం గురించి మాట్లాడను. ఎవరి నమ్మకం వాళ్ళది. కాంతార కంటే చాప్టర్ 1 కంటే ఇంకా బాగుంటుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలని ప్రేక్షకులు ఎప్పటికపుడు మర్చిపోలేరు. ముఖ్యంగా ఒక సన్నివేశం అందరకి జీవితాంతం గుర్తుండి పోతుంది. నన్ను బయట చూసినప్పుడల్లా ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని చిత్ర పరిశ్రమ టెక్నీషియన్స్ కి ఇన్ స్ప్రెషన్ ఇస్తుందని చెప్పుకొచ్చాడు.
కాంతార పార్ట్ 1 'విజయదశమి'(Vijayadasami)కానుకగా అక్టోబర్ 2 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్(Rukmini Vasanth)జోడీ కట్టడం ప్రత్యేకతని సంతరించుకుంది. హోంబలే(Homabale Films)ఫిల్మ్స్ మరో సారి హిట్ ని అందుకోవడం ఖాయమనే మాటలు సౌత్ సినీ సర్కిల్స్ లో విన్పడుతున్నాయి. అన్ని భాషల్లోను ప్రమోషన్స్ స్టార్ కానుండగా రిషబ్ శెట్టి నే దర్శకుడు అనే విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



