ENGLISH | TELUGU  

హోటల్ రూమ్ కి రమ్మన్న కాంగ్రెస్ నేత రాహుల్.. ప్రముఖ నటి సంచలన ఆరోపణ!

on Aug 21, 2025

 

ఫిమేల్ సెలబ్రిటీలకు కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర మెసేజ్ లు పంపుతుంటారు. అవి మితిమీరితో సెలబ్రిటీలు ఒక్కోసారి తమ ఆవేదనను బయట ప్రపంచంతో పంచుకుంటూ ఉంటారు. ఎక్కువసార్లు 'వాళ్ళ బుద్ధే అంతలే' అని వదిలేస్తుంటారు. అయితే ఆకతాయిల సంగతి అటుంచితే.. బాధ్యతగల గల పదవిలో ఉన్నవాళ్లు, ప్రజా సేవలో ఉన్నవాళ్లు కూడా అలా అసభ్యకర మెసేజ్ లు పంపితే ఎంత దారుణంగా ఉంటుంది. ఓ ప్రముఖ నటికి అలాంటి అనుభవమే ఎదురైంది.

 

కేరళకు చెందిన మాజీ జర్నలిస్ట్, నటి రిని జార్జ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఓ యువ రాజకీయ నాయకుడు తనను వేధిస్తున్నట్లు ఆరోపించారు. జాతీయ పార్టీకి చెందిన నాయకుడు, ఎమ్మెల్యే కొంతకాలంగా తనకు అసభ్యకర మెసేజ్ లు పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేశానని మెసేజ్ చేసినట్లు ఆరోపించారు. అయితే ఆ నాయకుడి పేరు చెప్పడానికి రిని జార్జ్‌ ఇష్టపడలేదు. తనతో పాటు ఎందరో మహిళలను ఆ నాయకుడు వేధించాడని.. అతనిపై వారి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రిని జార్జ్‌ చెప్పుకొచ్చారు. 

 

కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్‌ మమ్కూతతిల్‌ పైనే రిని జార్జ్‌ ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాహుల్ రాజీనామా చేయడం విశేషం.

 

Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.