శారీ గర్ల్ మ్యూజిక్ వింటోందా ? ఆమె నుంచే మ్యూజిక్ వస్తోందా ?
on Jan 30, 2024
.webp)
ఆర్జీవీ మూవీస్ అంటే ఒక అది, ఒక ఇదీ ఉంటుంది. ఆడియన్స్ అంతా కూడా ఆర్జీవీని తిట్టుకుంటూనే ఉంటారు అలాగే నెక్స్ట్ వచ్చే ఆర్జీవీ మూవీ ఏమిటి అని కూడా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి టైములో ఇప్పుడు ఆర్జీవీ "శారీ" అనే మూవీ తియ్యబోతున్నాడు. ఆర్జీవీ హీరోయిన్స్ అంటే చాలు బోల్డ్ సీన్స్ లో నటించాల్సిందే. ఆ మూవీస్ పెద్దగా హిట్ కాకపోయినా హీరోయిన్స్ మాత్రం పిచ్చ ఫేమస్ అయిపోతారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో శారీ గర్ల్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న శ్రీలక్ష్మి సతీష్ అలియాస్ ఆరాధ్య దేవితోనే ఈ మూవీ చేస్తున్నాడు.రీసెంట్ గా ఆమె వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసాడు. "ఎవరైనా నాకు కొంచెం చెప్పండి.
ఆమె మ్యూజిక్ వింటోందా లేదంటే ఆమె నుంచే మ్యూజిక్ వస్తోందా" అని కాప్షన్ పెట్టాడు. ఇక నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ ని పోస్ట్ చేశారు. "ఆర్జీవీ సర్ కళ్ళల్లోంచి మ్యూజిక్ వస్తోంది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె నుంచే మ్యూజిక్ వస్తోంది. మీకు భలే దొరుకుతారంతా" అంటూ కామెంట్స్ పెట్టారు. ఇకపోతే ఆరాధ్యా దేవి ఒక మోడల్.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో శారీ రీల్స్ తో ఫుల్ పాపులర్ అయ్యింది. అలా ఆర్జీవీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ సోషల్ మీడియా బ్యూటీ. ఆమె కొన్ని మలయాళ షార్ట్ ఫిలిమ్స్ లో చిన్న చిన్న రోల్స్ లో నటించింది. శారీ మూవీని ఆర్జీవీ నిర్మిస్తుండగా అఘోష్ వైష్ణవం ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ శారీ మూవీ పోస్టర్ మీద "శృతిమించిన ప్రేమ కూడా ప్రమాదకరమే" అని లైన్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. వరుసగా ఈ సినిమా పోస్టర్స్ వర్మ రిలీజ్ చేస్తూ ఆ అమ్మాయిని కూడా ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ ని ఇప్పటినుంచే వెరైటీగా చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది అమ్మాయిల్ని వెండితెరకి హీరోయిన్స్ గా పరిచయం చేసిన వర్మ ఇప్పుడు శ్రీలక్ష్మీ సతీష్ ని కూడా పరిచయం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



