10 నిమిషాల పాట...రూ.2 కోట్ల ఖర్చు
on Mar 25, 2015
ఈరోజుల్లో రెండు కోట్లు అంటే.. ఓ చిన్న సినిమా తీసేసి రిలీజ్ చేయొచ్చు. అలాంటిది కేవలం ఒక్క పాట కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టడం విడ్డూరమే. రేయ్ కోసం వైవిఎస్ చౌదరి ఆ సాహసం చేశాడు. వైవిఎస్ చౌదరి - సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం రేయ్. ఈ సినిమా బడ్జెట్ రూ.35 కోట్లని తెలుస్తోంది. ఓ డెబ్యూ హీరోకి ఈ లెవిల్లో ఖర్చు పెట్టడమే సాహసం అనుకొంటే అందులో ఓ పాట కోసం రూ.2 కోట్లు కేటాయించారట. రేయ్‌లో ఇది కీలకమైన పాట అట. క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాట సుమారు 10 నిమిషాల పాటు సాగుతుందట. క్లైమాక్స్ అంతా ఈ పాటేనని టాక్. ఈ పాట కోసం 35 రోజుల పాటు కష్టపడ్డారట. డాన్స్ మాస్టర్ ప్రేమ్‌రక్షిత్ రకరకాల స్టెప్స్ కంపోజ్ చేశాడట. ఈపాట ఓ లెవెల్‌లో ఉండబోతోందని వైవిఎస్ చౌదరి చెబుతున్నాడు. సినిమా బాగుంటే, హిట్టయితే 'ఈ పాట భలే తీశాడ్రా..' అంటారు. అదే నెగిటీవ్ రిజల్ట్ వస్తే.. 'ఒక్క పాట కోసం మరీ ఇంత ఖర్చు పెట్టాలా 'అని సెటైర్లు వేస్తారు. మరి పాట చూశాక ప్రేక్షకుడి కామెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా వచ్చే వరకూ ఆగాలి.