రెడ్డి ఫిలిమ్స్... కేరాఫ్ రెడ్డి డైరెక్టర్స్
on Nov 26, 2019
ఫ్యాక్షన్ ఫిలిమ్స్ తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన కాలంలో ప్రతి సినిమాలో హీరో పేరులో చివరి పదం పక్కాగా రెడ్డి అయ్యి ఉండేది. ఉదాహరణకు... 'ఇంద్ర'లో చిరంజీవి పేరు ఇంద్రసేనా రెడ్డి. సినిమాలో హీరో పేరు టైటిల్ గా 'సమరసింహారెడ్డి', 'చెన్నకేశవ రెడ్డి' సినిమాలు చేశారు. 'ఆది'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఆదికేశవ రెడ్డి. అప్పట్లో ఈ కోవలో మరికొన్ని సినిమాలు వచ్చాయి. ఈమధ్య రెడ్డి బయోపిక్స్ వచ్చాయి. ఆయా సినిమాల దర్శకులు రెడ్డీస్ కావడం యాదృశ్చికమే కావొచ్చు. కానీ, రెడ్డి బయోపిక్స్ కేరాఫ్ రెడ్డి డైరెక్టర్స్ కావడం గమనించదగ్గ అంశం.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి నటించిన బయోపిక్ 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి. పదేళ్లుగా చిరంజీవి దగ్గర ఉయ్యాలవాడ కథ ఉంది. చివరకు, ఈ కథను డైరెక్ట్ చేసే ఛాన్స్ సురేందర్ రెడ్డికి రావడం యాదృశ్చికమే. ఇటీవల వచ్చిన మరో రెడ్డి బయోపిక్ 'జార్జ్ రెడ్డి'. ఈ సినిమాకు దర్శకుడు జీవన్ రెడ్డి. నిర్మాతలు అప్పిరెడ్డి, దామోదర్ రెడ్డి, సంజయ్ రెడ్డి. సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి. విడుదలకు ముందు 'నిర్మాతలకు రెడ్డీస్ అందరు కలిసి రెడ్డి సినిమా చేశారా?' అనే ప్రశ్న కూడా ఎదురైంది. యాదృశ్చికంగా కుదిరిందని నవ్వేశారు. బయోపిక్ కానప్పటికీ... తెలుగులో విజయ్ దేవరకొండను స్టార్ చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమా దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. ఈమధ్య టైటిల్ చివర రెడ్డి పేరుతో వచ్చిన సినిమాలకు దర్శకులు కూడా రెడ్డీస్ కావడమే ఇక్కడ డిస్కషన్ పాయింట్. కొన్ని కొన్ని అలా కుదురుతాయంతే.
Also Read