విషయం ఉంటే ఎంకరేజ్ చేస్తా : విజయ్ దేవరకొండ
on Oct 5, 2018
యూత్ సన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా నోటా సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. పెళ్ళిచూపులతో ప్రేక్షకులకు దగ్గరైన విజయ్.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక గీతగోవిందంతో కలెక్షన్ల వర్షం కురిపించి స్టార్ హీరోల రేస్ లోకి ఎంటరయ్యాడు. ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే మరోవైపు బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు విజయ్. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి బట్టలు రిలీజ్ చేసిన విజయ్.. రీసెంట్ గా 'కింగ్ ఆఫ్ ద హిల్’ అని ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమా నిర్మాణ రంగంలోకి కూడా ఎంటరయ్యాడు.
నోటా విడుదల సందర్భంగా మీడియాతో ముచ్చడించిన విజయ్.. తాను స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'ముందుగా కూర్చుని ప్లాన్ చేసిందేమీ కాదు. ఒక రోజు ఎందుకో అనిపించిందని మొదలుపెట్టా. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టాలి’ అనే ఆలోచన నుంచి పుట్టిందే ప్రొడక్షన్ హౌస్. దేవరకొండ అని వచ్చేలా నాదైన తరహా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌తో ‘కింగ్ ఆఫ్ ద హిల్’ అని పెట్టాను. అంతేగానీ, ఇంకేమీ కాదు. ‘పెళ్లిచూపులు’ సమయంలో నేను, తరుణ్ ఓ స్ర్కిప్ట్‌ని నమ్మాం. ఆ రోజుల్లో మమ్మల్ని నమ్మి రూ.60 లక్షలను పెట్టేవారు లేరు. అది పెట్టినా, ఆ తర్వాత మళ్లీ విడుదల చేయడానికి ఎంతో తిరిగాం. మేం నమ్మిన విషయం.. బాగుంటుందని తెలిసినా, మేం చాలా తిరిగాం. అప్పట్లో మాలో విషయం ఉన్నట్టు.. ఇప్పటివారిలో విషయం ఉంటే, తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం. కాకపోతే నాకు నమ్మకం కుదరాలి’ అని విజయ్ చెప్పుకొచ్చారు.